Tuesday, April 1, 2025

ఆస్తుల వివాదం.. ఎసిబి వలలో హెడ్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లాలో ఓ అవినీతి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సోమవారం ఎసిబి వలకు చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ కోటేశ్వరరావు ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. కోటేశ్వరరావు ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ ఆస్తుల వివాదంలో నోటీసుకు హెడ్ కానిస్టేబుల్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News