న్యూస్ డెస్క్: పట్టు వదలని విక్రమార్కుడిలా వరుసగా ఏడుసార్లు యుపిఎస్‌సి పరీక్షలు రాసిన ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాంభజన్ కుమార్ ఎట్టకేలకు 8వ ప్రయత్నంలో విజయం సాధించారు. సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాంభజన్ కుమార్ యుపిఎస్‌సి 2022 పరీక్షలో 667వ ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు. రాజస్థాన్‌లో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన రా34 ఏళ్ల రాంభజన్ తండ్రి కూలి పని చేస్తున్నారు. అనేక సవాళ్లను, ఆటుపోట్లను ధైర్యంతో ఎదుర్కొన్న రాంభజన్ ఎనిమిదవసారి పరీక్ష రాసి గట్టి పోటీ మధ్య విజయం సాధించారు.
Aslo Read: ఆ మామిడిపండు ధర వింటే షాక్ అవుతారు..
రాంభజన్ జీవితం, లక్ష్యాన్ని సాధించడానికి ఆయన పడిన కష్టం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. పోలీసు అధికారిగా ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్న ఆయన కల నెరవేరడం వెనుక కఠోర పరిశ్రమ దాగి ఉంది. ఒక పక్క కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే యుపిఎస్‌సి పరీక్షకు ఆయన సన్నద్ధమయ్యారు. చదువు తప్ప మరో ధ్యాస లేకుండా కష్టపడ్డారు. చిన్నతలంలోనే కుటుంబాన్ని పోషించడానికి తాను కూడా కూలీ పనులకు ఆయన వెళ్లేవారు.
రాజస్థాన్‌లోని దౌసా జిల్లా బాపి అనే కుగ్రామానికి చెందిన తమది నిరుపేద కుటుంబమని, తన తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని రాంభజన్ తెలిపారు. గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రాఘమిక విద్యను అభ్యసించానని, 12వ తరగతి పాసైన తర్వాత ఢిల్లీ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యానని ఆయన చెప్పారు. ఉద్యోగం చేస్తూ డిగ్రీ, పిజి పూర్తి చేశానని, 2012లో హిందీలో ఎన్‌ఇటి సాధించానని ఆయన తెలిపారు. 2015లో అంజలీ కుమారిని వివాహం చేసుకున్న రాంభజన్ తన సీనియర్ అధికారుల స్ఫూర్తితో సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం కోచింగ్ తీసుకున్నప్పటికీ స్వీయ అధ్యయనం ద్వారా పరీక్షలో విజయం సాధించినట్లు ఆయన తెలిపారు.