Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి..

- Advertisement -
- Advertisement -

Head Constable killed in road accident in Nellore

నెల్లూరు: జిల్లాలోని గుడ్లూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం నరసాపురంలో వేగంగా దూసుకొచ్చిన ఓ బొలెరో వాహనం అదపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న శ్రీహరి అనే హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంరతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీహరి కొండాపురం పిఎస్ లో విధులు నిర్వహిస్తున్నాడు.

Head Constable killed in road accident in Nellore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News