Saturday, January 18, 2025

ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం..కాపాడిన హెడ్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లా చిలిప్‌చెడ్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సుధారాణి ఎస్‌ఐ యాదగిరి వేధిస్తున్నాడంటూ బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వేధింపులు భరించలేక బుధవారం రాత్రి 9ః30 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకునే ప్రయత్నం చేయగా హెడ్ కానిస్టేబుల్ సాదయ్య గమణించి సిబ్బందితో ప్రాణాలు కాపాడాడు. అనంతరం సిబ్బంది జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. ఆమె క్షేమంగా ఉందని పోలీస్ సిబ్బంది తెలిపారు.కాగా ఎస్‌ఐ వేధిస్తున్నాడంటూ ఏఎస్‌ఐ సుధారాణి సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సూసైడ్ లెటర్‌లో గత రెండు మూడు రోజులుగా విధులు చేయిస్తూ ఒకరోజు రెస్టులో వెళ్లిన నాకు ఆప్‌సెంట్ రాస్తూ ప్రతిసారి చిన్న దానికి అబ్సెంట్ పెట్టను రాసి ఇవ్వు అని ఎస్సై వేధిస్తున్నాడని లేఖలో పేర్కొంది.

ఏఎస్సైని వేధిస్తున్నట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం: తూప్రాన్ డిఎస్పీ వెంకట్‌రెడ్డి
ఏఎస్సైని మానసికంగా వేధిస్తున్నట్లు రుజువైన ఎస్‌ఐపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డిఎస్పీ వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్సై సుధారాణి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసి పైఅధికారులకు నివేదికను పంపిస్తామని, ఒకవేళ వేధింపులు నిజమైతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. డిఎస్‌పి వెంట నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై యాదగిరి, ఏఎస్‌ఐ మిస్బావోద్దిన్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News