Sunday, December 22, 2024

ఉపాధ్యాయుడిని రివాల్వర్ తో కాల్చిన హెడ్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉపాధ్యాయుడిని హెడ్ కానిస్టేబుల్ రివాల్వర్ తో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వారణాసిలో ధర్మేంద్ర కుమార్ అనే ఉపాధ్యాయుడు తన సిబ్బంది, పోలీసులతో కలిసి యుపి బోర్డు ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్లను ఎస్‌డి ఇంటర్ కాలేజీ వద్దకు తీసుకెళ్తున్నారు. కాలేజీ వద్ద ఎగ్జామ్ పేపర్ల కోసం విద్యాశాఖ అధికారులు, పోలీసులు వేచి చూస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ చందర్ ప్రకాశ్, ధర్మేంద్ర కుమార్ మధ్య చిన్న గొడవ జరిగింది. ప్రకాశ్ తన రివాల్వర్ తీసుకొని కుమార్‌పై కాల్పులు జరిపాడు. వెంటనే ఉపాధ్యాయుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఉపాధ్యాయుడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. వారణాసి ఎస్‌పి సత్యనారాయణ పర్జాపత్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News