Saturday, December 21, 2024

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు బలన్మరణం చెందారు. సంగారెడ్డి పట్టణం అయ్యప్ప కాలనీకి చెందిన మీసాల మాణిక్యం(43) అనే వ్యక్తి కూకట్‌పల్లి కెపిహెచ్‌బి కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి మోకిల పోలీస్ స్టేషను కు బదిలీ అయ్యారు. శనివారం రాత్రి విధులు ముగించుకుని సంగారెడ్డిలోని తన నివాసానికి వచ్చారు.

ఆదివారం మధ్యాహ్నం తిరిగి డ్యూటీకి వెళ్తానని భార్య ప్రశాంతి కి చెప్పాడు. ప్రశాంతి ఆదివారం కావడంతో చర్చికి వెళ్లింది. అక్కడికి తన భర్తకు ఫోన్ చేయగా, ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చి అయ్యప్ప కాలనీలోని ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో చూడగానే ఫ్యాన్‌కు ఉరేసుకుని భర్త చనిపోయినట్టుగా గమనించింది.దీంతో ఆమె అరవగా, చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూశారు.విగత జీవుడిగా పడి ఉన్న మాణిక్యం ను చూసి ప్రశాంతి బోరున విలపించింది.

పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి విచారణ ప్రారంభించారు. తమ కుటుంబలో ఎలాంటి సమస్యలు లేవని, ఎందుకు తన భర్త ఉరేసుకున్నాడో తమకు తెలియదని పోలీస్‌లకు ప్రశాంతి తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. వారంతా హాస్టల్‌లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News