Monday, December 23, 2024

బాలికపై ప్రధానోపాధ్యాయుడు అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: విద్యార్థులు తప్పు చేస్తే మందలించి సరైన మార్గంలో నడపించాల్సిన టీచర్, కామంతో కళ్లుమూసుకపోయి బాలికపై ప్రధానోపాధ్యాయుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెద్ద కొత్తపల్లి పంచాయతీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒంగోలుకు చెందిన అంజయ్య ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. బాలిక ఒంటరిగా బాత్రూమ్‌కు వెళ్లడం గమనించి అందులోకి దూరాడు. బాత్రూమ్‌లో బాలికపై అత్యాచారం చేస్తుండగా తప్పించుకొని తన తల్లిదండ్రుల వద్దకు బాలిక వెళ్లింది. వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు స్థానికులతో కలిసి అంజయ్యకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గతంలో విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఫొటోలు తీసినట్టు పిల్లలు చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేశామని డిఇఒ వివరణ ఇచ్చారు. మరి కొద్ది రోజుల్లో అంజయ్య ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. గతంలో పని చేసిన స్కూళ్లలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తేలితే సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News