Tuesday, January 21, 2025

ఇరాన్ సీక్రెట్ సర్వీస్ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారి

- Advertisement -
- Advertisement -

షాక్ ఇచ్చిన ఇరాన్ మాజీ అధ్యక్షుడు

టెహ్రాన్ : ఇరాన్‌లో ఇజ్రాయెల్ గూఢచర్యాన్ని తిప్పికొట్టే బాధ్యత ఉన్న సీక్రెట్ సర్వీస్ అధిపతే ఇజ్రాయెల్ వేగుగా మారినట్లు ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదినెజాద్ దిగ్భ్రాంతికరంగా వెల్లడించారు. ఇరాన్‌లో ఇజ్రాయెల్‌పై నిఘా వేసే వాధ్యత చేపట్టిన అత్యంత సీనియర్ వ్యక్తి మొసాద్ ఏజెంట్ అన్నది 2021 నాటికే స్పష్టమైందని అహ్మదినెజాద్ తెలియజేశారు. ‘ఇరాన్ లోపల ఇజ్రాయెల్ సంక్లిష్ట కార్యకలాపాలు సాగించింది. వారు తేలికగా సమాచారం సంపాదిస్తుండేవారు. ఇరాన్‌లో ఈ విషయమై వారు ఇప్పటికీ మౌనంగా ఉన్నారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కూపీ లాగేందుకుఇరాన్‌లోనియూనిట్ ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తే ఇజ్రాయెల్ ఏజెంట్’ అని అహ్మదినెజాద్ ‘సిఎన్‌ఎన్ తుర్క్’తో చెప్పారు.

ఇది ఏదో ఒక ఘటన కాదనిఅహ్మదినెజాద్ అన్నారు. ఇజ్రాయెల్ నిఘా కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యత ఉన్న ఇరానియన్ నిఘా బృందంలో అదనంగా 20 మంది ఏజెంట్లు మొసాద్‌కూ పని చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇరాన్ అణుశక్తి కార్యక్రమానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని సదరు ద్వంద్వ ఏజెంట్లు ఇజ్రాయెల్‌కు అందజేశారని అహ్మదినెజాద్ ఆరోపించారు.

వారికి 2018లో ఇరానియన్ అణుశక్తి పత్రాల చోరీతో ప్రమేయం ఉందని, వారు పలువురు ఇరానియన్ అణ్వస్త్ర శాస్త్రవేత్తలను కూడా హత్య చేశారని ఆయన ఆరోపించారు. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కేంద్రంపై వైమానిక దాడిలో ఆ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లాను హతమార్చడానికి ముందు అతను ఉన్న ప్రదేశం గురించి ఇజ్రాయెల్‌కు ఒక ఇరాన్ గూఢచారి కూపీ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అహ్మదినెజాద్ తాజా ఆరోపణలు చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News