Wednesday, January 22, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఎంకెజి గ్రూప్ అధినేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఎంకెజి గ్రూప్ అధినేత డా.రవీందర్ నాయక్, ఓయూ గిరిజన రాష్ట్ర నేత డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో వరంగల్‌లోని శ్రీ సాయి విజ్ఞాన భారతి హై స్కూల్‌లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

అడవులను ,ప్రకృతిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో జోగినపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్రాన్ని హరితహారం చేయడం గొప్ప విషయమని, పార్లమెంట్లో తెలంగాణ గొంతుక ,నిరంతర శ్రామికుడు అయిన బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదినం రోజున మొక్కలు నాటడం తమకు సంతోషంగా ఉందన్నారు. మొక్కలు నాటే ఈ కార్యక్రమం భావితరాలకు స్ఫూర్తిని అందించే గొప్ప కార్యక్రమం అని వారు అన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని స్పూర్తి గా తీసుకొని ప్రపంచం అంత మొక్కలు నాటాలని వారు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి విజ్ఞాన భారతి హై స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ సామల శశిధర్ రెడ్డి,డైరెక్టర్ ముస్కు రోజా శ్రీకాంత్ రెడ్డి, స్వరూప ,విద్యార్థులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News