Monday, December 23, 2024

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డా. బిఎస్. రావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -
ఉదయం ఇంట్లోనే అస్వస్థతకు గురైన బిఎస్ రావు
జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స,కొద్ది సేపటికి కానరాని లోకాలకు
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కూతురు సీమ…
నేడు విజయవాడలోని తాడిగడప క్యాంపస్‌లో అంత్యక్రియలు

హైదరాబాద్ : శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (75) గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని స్వస్థలమైనా విజయవాడలోని తాడిగడప క్యాంపస్‌లోని వారి స్వగృహానికి తరలించారు. ఆయన కూతురు సీమ అమెరికాలో ఉండటంతో ఆమె రాగానే శుక్రవారం విజయవాడలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. ఇంగ్లండ్, ఇరాన్‌లో వైద్యులుగా సేవలందించిన బీఎస్ రావు దంపతులు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభించారు. విజయవాడ నుంచి విద్యాసంస్థలను అంచెలంచెలుగా విస్తరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 321 జూనియర్ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్ ఉన్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

డా. బిఎస్‌రావు జీవిత ప్రస్థానం:  డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు 1947 ఆగస్టు 15వ తేదీన కృష్ణా జిల్లా అంగలూరులో నాగభూషణం, జానమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యబ్యాసం ఒక టీచర్ వద్ద జరగా ఉన్నత విద్యాభ్యాసం ఎస్వీఆర్‌ఎం హైస్కూల్‌లో సాగింది. 1964 సంవత్సరంలో పియుసి పూర్తి చేసిన ఆయన 1965లో గుంటూరు మెడికల్ కళాశాల్లో మెడికల్ విద్యనభ్యసించిన 1970లో ఝాన్సీలక్ష్మిబాయి వివాహం చేసుకున్నారు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్ధలను ప్రారంభించి వాటిని అగ్రస్థానంలో నిలిపారు. విజయవాడలోని పోరంకిలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన విద్యా సంస్ధల ప్రస్థానం ప్రారంభమైంది. విద్యాసంస్ధలను నెలకొల్పిన ఆయన తొలి అడుగులోనే అక్షర పరుగుతో ప్రపంచమంతా వ్యాప్తించి లక్షలాదిమంది ఇంజనీర్లు, వందలాది మంది వైద్యులు తీర్చిదిద్ది అనతి కాలంలో ఆసంస్ధలను అగ్రగామి పథంలో నడిపించి చరిత్ర సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు కేరాఫ్‌గా అడ్రస్సుగా శ్రీచైతన్య విద్యాసంస్ధలు ఉన్నత స్థానానికి చేరాయి. ఏపి, తెలంగాణ రాష్ట్రాలో కాకుండా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, చండీఘర్ , రాంచీ, బొకారో, ఇండోర్‌లలో బ్రాంచీలను నెలకొల్పారు. కర్నాటక, బెంగుళూరు, గంగావతి, రాయచూర్‌లో ఎన్నో బ్రాంచీలు ఏర్పాటు చేశారు.

వారసత్వానికి బాధ్యతలు:  బిఎస్‌రావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు… సీమ, మరొకరు సుష్మ.  ఇద్దరికి విద్యాసంస్దల బాద్యతలను ఇప్పటికే అప్పగించారు. శ్రీచైతన్య టెక్నో స్కూళ్లకు అకాడమిక్ డైరెక్టర్‌గా సీమ ఉన్నారు. ఇక సుష్మ సంస్ధకు సీఈవో, అకడమిక్ డైరెక్టర్‌గా బాద్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యాసంస్దలో 45 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. తన వంతుగా సామాజిక సేవలు విద్యారంగంలో బిఎస్‌రావు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్స్ నుంచి లైప్ టైం అచీవ్‌మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్ షిప్ అవార్డు అందుకున్నారు. నల్లగొండ జిల్లాలో ప్లోరోసిస్ బాధిత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ప్లోరోసిస్ కారణంగా కన్నుమూసిన కుటుంబాల నుంచి వంద మంది చిన్నారులకు ఉచిత విద్యను అందించే కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది. దీంతో పాటు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాల నుంచి కూడా చిన్నారులకు శ్రీచైతన్య విద్యాసంస్దల ద్వారా ఉచిత అందించి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News