విజయవాడ తాడిగడప శ్రీచైతన్య మెయిన్ క్యాంపస్ నుంచి ప్రారంభం
ఈడుపుగల్లు వ్యవసాయక్షేత్రంలో అంతిమ సంస్కారాలు
కడచూపు కోసం తరలివచ్చిన రాజకీయ, విద్యా, వ్యాపార ప్రముఖులు
హైదరాబాద్: భారత విద్యారంగ దిగ్గజం శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డా. బి.ఎస్.రావు గుండెపోటుతో మరణించడంతో యావత్ విద్యాలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం ఆయన పార్ధివ దేహాన్ని విజయవాడ తాడిగడప క్యాంపస్‌కు తరలించి సందర్శనార్దం ఉంచారు. ఆ మహోన్నతి వ్యక్తికి నివాళులు అర్పించేందుకు రాజకీయ, విద్యా, వ్యాపార వేత్తలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. బందుమిత్రులు, శ్రేయోభిలాషులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో పాటు అశేష ప్రజానీకం తాడిగడపకు తరలివచ్చి శ్రద్దాంజలి ఘటించారు. శుక్రవార ఆయన చిన్న కుమార్తె సీమా అమెరికా నుంచి విజయవాడకు చేరుకోవడంతో అంతియాత్రను నేడు ఉదయం 8.30 గంటలకు ప్రారంభిస్తున్నట్లు, అంతియాత్ర విజయవాడ తాడిగడప శ్రీచైతన్య మెయిన్ క్యాంపస్ నుండి ప్రారంభమై ఈడుపుగల్లులోని వ్యవసాయక్షేత్రం వరకు కొనసాగుతుందని అక్కడే అంతిమ సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.