Thursday, January 23, 2025

కాలువలో తలలేని యువతి మృతదేహం….

- Advertisement -
- Advertisement -

Headless dead body found in Meerut

లక్నో: కాలువలో తలలేని యువతి మృతదేహం కనిపించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లా లఖీపూరా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. లేన్ నంబర్ 28 ప్రాంతం లిసారీ గేట్ సమీపంలోని డ్రైనేజీలో ఓ మహిళ మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయడంతో తలలేని మొండెం కనిపించింది. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతురాలికి 20 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. లఖీపూరా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల మిస్సింగ్ కేసుల వివరాలను సేకరించి మృతురాలు వివరాలు చెబుతామని పోలీస్ అధికారి అర్వింద్ చౌరాసియా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News