Sunday, December 22, 2024

విద్యార్థినిలపై ప్రధానోపాధ్యాయుడు వేధింపులు

- Advertisement -
- Advertisement -

Headmaster harassment on students

జార్ఖండ్‌: పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి, మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉపాధ్యాయులు దారితప్పుతున్నారు. తన పాఠశాలలో చదువుతున్న పిల్లలను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. పాఠశాల హాస్టళ్లో ఉంటున్న మైనర్‌ బాలికలను వేధిస్తున్నాడు. దీంతో ఆ చిన్నారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రధానోపాధ్యాయుడును అరెస్టుచేసిన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని ఛాయ్‌బాసా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఏ ప్రైవేట్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమను వేధిస్తున్నాడని ఏడుగురు మైనర్‌ విద్యార్థినులు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News