Tuesday, November 5, 2024

ఆరోగ్య, వెల్‌నెస్ ప్రయోజనాలతో ఖాతా విడుదల చేసిన సూర్యోదయ్ బ్యాంక్

- Advertisement -
- Advertisement -

 

health and wellness benefits

మన తెలంగాణ,సిటీబ్యూరో: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఖాతాదారులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సైతం కాపాడుతుందనే భరోసాతో సూర్యోదయ్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సేవింగ్స్ ఖాతాను విడుదల చేసింది. నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబానికి 25లక్షల రూపాయల టాపర్ ఆరోగ్యభీమా, వార్షిక ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీ, ఆన్‌కాల్ అత్యవసర అంబులెన్స్ మెడికల్ కేర్ సేవలతో అందిస్తుంది. ఈసందర్భంగా ఆసంస్ద ఎండీ, సీఈవో ఆర్.భాస్కర్‌బాబు మాట్లాడుతూ అత్యవసర వైద్యసేవల ఖర్చు, ఆర్దికంగా పెనుబారం అవుతుంటుందని, అందుకోసం హెల్త్ అండ్ వెల్‌నెస్ ఖాతాను పరిచయం చేయడంద్వారా ఈభారాన్ని తగ్గించే ప్రయత్నం చేసామన్నారు. కుటుంబం కోసం సమగ్రమైన ఆర్దిక, ఆరోగ్య ప్రణాళికలో మేము కూడా భాగం కావాలనుకుంటున్నట్లు చెప్పారు. కేవలం వారి సంపద మాత్రమే వృద్ది చెందడం కాకుండా వైద్య అత్యసరాలతో వారి జేబు నుంచి ఖర్చుచసి ఇబ్బంది కూడా తప్పిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News