Friday, April 4, 2025

పండ్లతోనే కాదు.. మామిడి ఆకులతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

- Advertisement -
- Advertisement -

మామిడి పండును “కింగ్ అఫ్ ఫ్రూట్” అని పిలుస్తారు. ఈ పండును తినడానికి ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే, మామిడి పండు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మీకు తెలుసా? మామిడి ఆకులలో విటమిన్లు ఎ, సి, బి పుష్కలంగా ఉంటాయి. దీనితో పాటు వాటిలో యాంటీఆక్సిడెంట్, ఔషధ గుణాలు కూడా ఉంటాయి. దీంతో ఇవి అనేక సమస్యలను నివారిస్తాయి. అయితే, ఇప్పుడు మనం మామిడి ఆకుల వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాల గురుంచి తెలుసుకుందాం.

1. మధుమేహ రోగులు మామిడి పండ్లకు దూరంగా ఉండాలని సూచించినప్పటికీ, దాని ఆకులు మధుమేహానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి. దీని కోసం మామిడి ఆకులను ఎండబెట్టి, దాని పొడిని తయారు చేసి ప్రతిరోజూ తీసుకోవాలి.

2. మామిడి ఆకులు జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి. దీని కోసం మామిడి ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని చల్లబరిచి, తర్వాత ఆ నీటితో జుట్టును బాగా మసాజ్ చేసుకోవాలి.

3. మామిడి ఆకు కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి మంచి పరిష్కారం. దీని కోసం మామిడి ఆకులను వేడి నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో త్రాగాలి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. అంతేకాకుండా హానికరమైన టాక్సిన్స్‌ను కూడా తొలగిస్తుంది. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

4. మామిడి ఆకు టీని క్రమం తప్పకుండా తాగితే, అది బరువు తగ్గించే ప్రయాణంలో చాలా సహాయపడుతుంది. ఇది సహజ జీవక్రియ బూస్టర్. ఈ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా శరీరం ఆహారాన్ని బాగా జీర్ణం చేసుకోగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News