Tuesday, December 24, 2024

షర్మిల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్:వైఎస్ఆర్ టిపి నేత వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 11 వ తేదీన తెల్లవారుజామున ఒంటి గంటకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. లోబిపి, బలహీనత ,మైకము ఉండటంతో ఆమె ఆస్పత్రిలో చేరారు. ఆమెకు డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ-రీనల్ అజోటెమియా వ్యాధితో ఆమె బాధపడుతున్నట్టు వైద్యలు తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ రోజు లేదా రేపు ఉదయం డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. ఆమె 2 నుంచి 3 వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News