- Advertisement -
హైదరాబాద్: మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో నటుడు మోహన్ బాబు మంగళవారం అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒళ్లు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయనకు కంటి దిగువ భాగంలో గాయం ఉన్నట్టు గుర్తించామని, బిపి ఎక్కువగా ఉందని, గుండె కొట్టుకోవడంలో హెచ్చతగ్గులు కనిపించాయని వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నాడు. మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు మధ్య గొడవలు జరుగతున్న విషయం తెలిసిందే.
- Advertisement -