- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్సీ నిర్వహించనున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించనున్నారు. రాష్ట్రంలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. దంచికొట్టిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
- Advertisement -