Monday, December 23, 2024

హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా?

- Advertisement -
- Advertisement -

 ఆరోగ్య ఖర్చులు అదుపు తప్పితే ఆర్థిక భారమే
 ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు

న్యూఢిల్లీ: ఈ రోజుల్లో ఆరోగ్య ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారింది. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం కంటే వైద్య ద్రవ్యోల్బణం అత్యధికంగా పెరుగుతోంది. ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆరోగ్యం విషయంలో బడ్జెట్‌కు మించి ఖర్చు (ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెండీచర్: ఒఒపిఇ) మొత్తం దేశం హెల్త్‌కేర్ ఖర్చుల్లో సుమారు 62 శాతం వాటా ఉంది. పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు గణనీయమైన ఆర్థిక భారం ఎదుర్కోవాల్సి వస్తోందని క్యూబ్‌హెల్త్ సిఇఒ, కొఫౌండర్ క్రిస్ జార్జ్ వెల్లడించారు. భారతదేశంలోని పట్టణ ప్రజల్లో 82 శాతం మంది ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోలేదు. దీని వల్ల హాస్పిటల్లో చేరినవారు దాదాపు 55 శాతం మంది తమ సేవింగ్స్ డబ్బు ఆరోగ్య ఖర్చులకు వినియోగిస్తుండగా, 23 శాతం మంది అప్పులు చేయాల్సి వస్తోంది. 98 శాత మంది వృద్ధులు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కల్గిలేరు. పాలసీబజార్ వంటి వెబ్‌సైట్ల ద్వారా వృద్ధులే కాకుండా యువత కూడా వారి ఆర్థిక భారం తట్టుకునేలా ఆరోగ్య బీమా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

14 శాతానికి వైద్య ద్రవ్యోల్బణం
మొదట రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలపై ద్రవ్యోల్బణం భారం పెరిగింది. మరోవైపు కరోనా మహమ్మారి కాలం నుండి ఆసుపత్రిలో చికిత్స కూడా ఖరీదైనదిగా మారింది. గత ఐదేళ్లలో ఏదైనా వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరితే చికిత్సకు అయ్యే ఖర్చు రెట్టింపు స్థాయిలో పెరిగింది. అంటు వ్యాధులు, శ్వాసకోశ రుగ్మతల చికిత్స కోసం బీమా క్లెయిమ్‌లు విపరీతంగా పెరిగాయి. ఒకవైపు ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంటే, వైద్య ద్రవ్యోల్బణం 14 శాతానికి పైగా పెరిగింది.

5 ఏళ్లలో చికిత్స ఖర్చు రెట్టింపు
పాలసీబజార్ డేటా ప్రకారం, అంటు వ్యాధుల చికిత్స కోసం 2018లో సగటు మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రూ.24,569గా ఉండగా, అది 2022లో రూ.64,135కి పెరిగింది. అంటే 5 ఏళ్లలో వ్యాధి చికిత్సకు ఖర్చు 160% ఖరీదైనది అయింది. ముంబై లాంటి మెగాసిటీల్లో ఐదేళ్లలో ఈ వ్యయం రూ.30,000 నుంచి రూ.80,000కి పెరిగింది. ఇక శ్వాసకోశ వ్యాధుల చికిత్స కోసం సగటు క్లెయిమ్ 2018లో రూ. 48,452 ఉండగా, 2022లో ఇది రూ. 94,245కి పెరిగింది. అంటే ఏడాదిలో చికిత్స ఖర్చులు 18 శాతం పెరిగింది. ముంబైలో అయితే ఈ ఖర్చు రూ.80 వేల నుంచి రూ.1.70 లక్షలకు పెరిగింది.

కరోనా తర్వాత ఆసుపత్రి ఖర్చు
కరోనా మహమ్మారి ప్రబలిన తర్వాత చికిత్సపై ఖర్చు పెరిగింది. చికిత్సకు ఉపయోగించే పదార్థాలపై కూడా ఖర్చు పెరిగింది. ఇంతకుముందు మొత్తం బిల్లులో ఈ మెటీరియల్స్ వాటా 3 నుంచి 4 శాతం ఉండగా, ఇప్పుడు 15 శాతానికి పెరిగింది. వైద్య ద్రవ్యోల్బణం ఇతర ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరుగుతోంది. ద్రవ్యోల్బణం రేటు 7 శాతం ఉంది కానీ వైద్య ద్రవ్యోల్బణం రెట్టింపు రేటుతో పెరుగుతోంది. ఆరోగ్య బీమాకు డిమాండ్ పెరగడంతో, చికిత్స కూడా ఖరీదైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News