Monday, December 23, 2024

వ్యాయామం, ఒత్తిడిలేని జీవితంతో ఆరోగ్యం పదిలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నియమిత రూపంలో వ్యాయామం, ఒత్తిడి లేని జీవన శైలి కొనసాగించగలగడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి పలు అంశాలపై అవగాహన కలిగి సాగించే జీవన శైలిని అవలింబించాల్సిన అవసరం ఉందని ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి చీప్ మెడికల్ అధికారి డా. సర్దార్ సూచించారు. మానవ జీవితంలో ఎన్నో రకాలైన పనులు చేయడానికి అవసరమైన స్వాతంత్య్రాన్ని మంచి ఆరోగ్యం ఎలా తీసుకొని రాగలదనే విషయాన్ని వివరించారు. అంతే గాకుండా మన శరీరం పలు సందర్భాలలో మనలను ఆరోగ్య సంబంధిత అంశాలపై హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుందని వాటిని నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తూ అవసరమైతే నిపుణులైన వైద్యులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు.

77వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వినూత్నమైన బైక్ ర్యాలీ నిర్వహించారు. శక్తివంతమైన ఆరోగ్యకర జీవన శైలి సాధించడం నినాదంతో నిర్వహించబడిన ఈ బైక్ ర్యాలీ హుస్సేన్ సాగర్ వద్ద నున్న ట్యాంక్ బండ్ వరకూ వెళ్లి తిరిగి అమీర్ పేటకు చేరుకొనేలా నిర్వహించారు. ఈకార్యక్రమంలో యల్ కె. సన్నీ సింగ్, పి. జాన్,శివన్ కుట్టీ, శామ్, కె. అనిల్ రాజ్‌తో పాటూ ఇతర సిబ్బంది సుమారు 25 మందికి పైగా బైకర్లు తమ తమ సూపర్ బైక్స్ తో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News