Friday, December 20, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యసిబ్బంది అలర్ట్….

- Advertisement -
- Advertisement -

Health Minister Harish Rao inspects government hospitals

ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యసిబ్బంది అలర్ట్….
వైద్యశాఖ మంత్రి హరీష్‌రావు తనిఖీలతో టెన్షన్
కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సంఘటనతో అప్రమత్తం
ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులు తనిఖీలు చేయనున్నట్లు అధికారులు వెల్లడి

మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, రోగులకు అందించే సౌకర్యాలపై ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వరుసగా తనిఖీలు చేయడంతో ఆసుపత్రి సిబ్బందిలో వణుకుపుడుతుంది. ఇష్టానుసారంగా విధులకు హాజరైతూ రోగులకు సేవలందించకుండా నిర్లక్షం చేసేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుండటంతో తమకు ఎలాంటి ముప్పు వస్తుందోనని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానలు, ఏరియా ఆసుపత్రుల సిబ్బందితో పాటు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టి ఆసుపత్రుల్లో చేసి వైద్యులు, నర్సులు, టెక్నిషియన్లు టెన్షన్ పడుతున్నారు. ఇన్నాళ్లు ఆసుపత్రుల ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని విధులకు డుమ్మా కొడుతూ నెలవారి వేతనం పొందే వారిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు వేటు వేసేందుకు సిద్దమైన్నట్లు తెలుస్తుంది. తాజాగా కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఒక వైద్యుడు లంచం తీసుకుంటున్నాడే ఫిర్యాదులు రావడంతో అక్కడిక్కడే అతని సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్షం వహించే సిబ్బందికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తోటి సిబ్బంది వెల్లడిస్తున్నారు.

రోగులకు సకాలంలో వైద్య సేవలతోపాటు, డయాగ్నస్టిక్ పరీక్షలు, మందులు అందజేయాలని సూచించారు. త్వరలో కింగ్ కోఠి ఆసుప్రతి, మెటర్నటీ,ఈఎన్‌టీ ఆసుపత్రుల పరిస్దితులను కూడా తనిఖీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రోగుల బంధువుల నుంచి ఫిర్యాదులు వచ్చిన ప్రతి ఆసుపత్రిని తనిఖీ చేసి మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా బస్తీదవఖానలు, ఏరియా ఆసుపత్రుల సిబ్బంది ఆలస్యంగా విధులకు వచ్చి, తొందరగా ఇంటిబాట పడుతున్నట్లు, వారి సక్రమంగా డ్యూటీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని స్దానిక ప్రజలు కోరుతున్నారు. త్వరలో ఉస్మానియా, గాంధీ వంటి పెద్దాసుపత్రులో ఓపి సేవలు సాయంత్ర వరకు ఉండేలా ప్రయత్నాలు చేస్తుండటంలో ముందుగా సిబ్బంది విధులు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

ఆరోగ్యశాఖ మంత్రిగా హరీష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పేదల వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని పలు ఆసుపత్రులకు పరికరాలు అందజేశారు. అంతేగాకుండా పేదలకు ఉచితంగా పరీక్షలు చేసేలా 10 డయాగ్నస్టిక్ హబ్‌లు ప్రారంభించి 150 రకాలు టెస్టులు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పడే ఇబ్బందులు గుర్తించి వారంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లకుండా స్దానిక ఆరోగ్య కార్యకర్తలు రక్తపోటు, చక్కెర, హృదయ సంబంధిత రోగులకు ఇంటివద్దకే వచ్చి మందులు పంపిణీ చేసేలా కొత్త కార్యక్రమం చేపట్టారు. భవిష్యత్తులో సర్కార్ దవాఖానల్లో ప్రజలు వైద్యం చేయించుకునేలా సిబ్బంది,మందులు ఏర్పాట్లు చేయనున్నట్లు వైద్యాధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News