- Advertisement -
న్యూఢిల్లీ: ప్రపంచంలోని కొన్ని దేశాలలో హఠాత్తుగా కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ బుధవారం దేశంలో కొవిడ్ పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపి అప్రమత్తంగా ఉండి కొవిడ్ పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. కొవిడ్ ఇంకా అంతం కాలేదని, అప్రమత్తంగా ఉండి నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మాండవీయ ట్వీట్ చేశారు.
ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనా తదితర దేశాలలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా వేరియంట్లను గుర్తించడానికి అన్ని శాంపుళ్లను సీక్వెనింగ్ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మంగళవారం ఆదేశించింది.
- Advertisement -