Saturday, December 28, 2024

అవి కేంద్రమిచ్చిన మెడికల్ కాలేజీలు కావు

- Advertisement -
- Advertisement -

అవి కేంద్రమిచ్చిన మెడికల్ కాలేజీలు కావు
నిబంధనల ప్రకారం అర్హతలను బట్టి ఎన్‌ఎంసి మంజూరు చేసినవి
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు
వైద్యారోగ్య శాఖ స్పష్టీకరణ
తెలంగాణలో మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోద ముద్ర అని సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న వార్త పూర్తిగా నిరాధారమైనదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 9 ప్రభుత్వ, 4 ప్రైవేటు మెడికల్ కాలేజీలకు మొత్తం 13 మెడికల్ కాలేజీలకు ఈ విద్యాసంవత్సరం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసి) అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్ని మెడికల్ కాలేజీలు పూర్తిగా రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేస్తున్నవేనని తెలిపింది.

అంతేగానీ మెడికల్ కాలేజీల ఏర్పాటులో కేంద్ర నిధులు రూపాయి కూడా లేదని రాష్ట్ర వై ద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎన్‌ఎంసి అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, నిర్దేశించిన అన్ని నిబంధనలు సంతృప్తి పరిచేలా ఉన్నాయా లేవా అని పలుమార్లు పరిశీలించిన అనంతరం మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తుందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News