Monday, December 23, 2024

ఫార్మసీ విద్య ఇక క్రమబద్ధం.. కమిషన్ బిల్లు ముసాయిదా వెల్లడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ‘నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్లు’ ముసాయిదాను వెలువరించింది. 75 సంవత్సరాలుగా అమలులో ఉన్న ఇప్పటి ఫార్మసీ యాక్ట్ స్థానంలో ఈ చట్టం రూపొందించేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పుడున్న ఫార్మసీ కౌన్సిల్ బదులుగా జాతీయ ఫార్మసీ కమిషన్‌ను తీసుకువచ్చేందుకు ఈ బిల్లు తలపెట్టారు. దేశంలోని అందరు ఔషధ వృత్తిదారులను ఈ ముసాయిదా బిల్లు పరిధిలోకి తీసుకువచ్చేందుకు సరైన విధివిధానాలు రూపొందించారు. పౌరుల నుంచి ఈ ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలను కోరుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

ఈ నెల 10 వ తేదీన తమ వెబ్‌సైట్‌లో సంబంధిత బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టినట్లు అధికారులు సోమవారం తెలిపారు. దేశంలో ఫార్మసీ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు దారితీస్తుంది. ఔషధ రంగ విద్యాభ్యాసంలో ఉన్నవారిని ఆ తరువాత వైద్యరంగంలో అర్హులైన డాక్టర్లుగా ప్రకటించేందుకు వీరికి సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ బిల్లులో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నింటిని పరిశీలించి తగు విధంగా పౌరులు స్పందించవచ్చునని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News