Monday, December 23, 2024

31 నుంచి ‘పొగాకు విముక్తి యువత” పై 60 రోజుల ప్రచారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈనెల 31 నుంచి అరవై రోజుల పాటు “పొగాకు విముక్తి యువత ” ప్రచారాన్ని చేపట్టడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సిద్ధమవుతోంది. యువత పొగాకును వినియోగించే అలవాటు ప్రారంభించకుండా నివారించడానికి, ఆ అలవాటు ఉన్నవారిని మాన్పించడానికి తగిన చర్యలు తీసుకోవడం పైనే కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ దృష్టి కేంద్రీకరించింది. పొగాకు వినియోగం తగ్గుతున్నప్పటికీ, అదింకా ఆమోదం కాని ఎక్కువ స్థాయిలో యువత , పెద్దల్లో కొనసాగుతోంది.

ప్రస్తుతం కౌమార దశలో ఉన్న (1315 ఏళ్ల ) వారిలో పొగాకు వినియోగం 2019లో 8.5 శాతం వరకు ఉండగా, అంతకు ముందు 2010లో ఈ వినియోగం 14.6 శాతం వరకు ఉందని గ్లోబల్ యూత్ టొబాకో సర్వే (జివైటిఎస్ ) వెల్లడించింది. 42 శాతం వరకు తగ్గుదల కనిపించింది. మే 31న పంచ పొగాకు వ్యతిరేక దినం పాటిస్తున్న సందర్భంగా పొగాకు విముక్తి విద్యావ్యవస్థ వంటి కార్యక్రమాలు ఈ ప్రచారోద్యమంలో చేపడుతున్నారు.

సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం, వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా నిషేధ చట్టం 2003 ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పెషల్ డ్రైవ్ పాటించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి వి హెకలీ జిమోమీ లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News