Tuesday, December 3, 2024

రూ.50 కోట్లతో హెల్త్ ఆన్ అజ్ విస్తరణ

- Advertisement -
- Advertisement -

నర్సింగ్- సేవలను ఇంటి దగ్గర అందుకోవచ్చు: సంస్థ చైర్మన్ లింగమనేని రమేశ్

మన తెలంగాణ/ హైదరాబాద్: హెల్త్ ఆన్ అజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 కోట్లు పెట్టుబడితో తమ సేవలను విస్తరిస్తోంది. నర్సింగ్- ఫిజియో థెరపీ సేవలను రీజనబుల్ ధరల్లో ఇంటి దగ్గర అందుకోవచ్చని, దీనికోసం తమ మొబైల్ యాప్‌ను ఉపయోగించుకోవాలని సంస్థ చైర్మన్ లింగమనేని రమేశ్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యాధిగ్రస్తులు, క్షతగాత్రులు, శస్త్ర చికిత్సానంతరం కోలుకుంటున్న వారు తమకు అవసరమైన వైద్య, ఫిజియోథెరపీ సేవల కోసం ఈ యాప్‌లో 24 గంటలూ బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

శాటిలైట్ (స్పోక్స్) కేంద్రాలను నెలకొల్పాం, మొబైల్‌లో బుక్ చేయగానే, సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లి, నర్సింగ్ సేవలందించేందుకు సుశిక్షతులైన నర్సింగ్, ఫిజియోథెరపీ, ఫార్మసీ డెలివరీ సిబ్బంది అందుబాటులో ఉంటారు. మొత్తంమీద 300కు పైగా మా సిబ్బంది ఉన్నారని రమేశ్ వివరించారు. మాదాపూర్‌లో 28 పడకలు, ఫిజియోథెరపీ స్టూడియో, ఔషధ-సర్జికల్ పరికరాల స్టోర్‌తో కూడిన సమగ్ర కేంద్రాన్ని సిద్ధం చేశామని, విశాఖపట్నంలో 20 పడకలతో ఏర్పాటు చేస్తున్నది 3 నెలల్లో సిద్దమవుతుందని సంస్థ ఎండి భరత్‌రెడ్డి తెలిపారు.

6 నెలల్లో రెండో దశ విస్తరణ చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తిరుపతిలలో ఒక్కో కేంద్రం, బెంగళూరులో మరో కేంద్రాన్ని ప్రారంభించాలన్న ప్రణాళిక ఉంది. ఇప్పటికే రూ.50 కోట్లు పెట్టుబడి చేశామని, రాబోయే మూడేళ్లలో విస్తరణ పథకాలకు మరో రూ.150- నుంచి 175 కోట్ల పెట్టుబడి అవసరం, ఇప్పటివరకు ప్రమోటర్లే పెట్టుబడి పెట్టారు. భవిష్యత్తు ప్రైవేటు వెంచర్, ఈక్విటీ క్యాపిటలిస్టుల నుంచి నిధులు సమీకరిస్తామని భరత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News