Sunday, January 19, 2025

హోంగార్డులకు పోలీసు తరహా హెల్త్ పాలసీ : మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

హోంశాఖలో పోలీసులకు అమలు చేస్తున్న మాదిరిగానే వైద్య, ఆరోగ్య విధానాలన్నింటిని హోంగార్డులకు కూడా వర్తించేలా చేస్తామని శాసన మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5లక్షల నుంచి 10 లక్షలకు పెంచిందని, ఆరోగ్య శ్రీలో అనేక చికిత్స లు చేర్చామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై హోంశాఖలో పనిచేసే సిబ్బందికి వారి సాలరీల నుండి క్రెడిట్ చేసి ఆర్‌టిసి మాదిరిగా ప్రమాదాలు జరిగినప్పుడు అందిస్తామన్నారు. హోంశాఖలో ఎవరైనా ప్రమాదాల్లో మరణిస్తే కోటి

రూపాయలకు పైగా భీమా వచ్చేలా చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ భీమా పథకం ఆర్‌టిసిలో అమలు చేస్తున్నామని, అక్కడ ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. పోలీసుల ఆరోగ్య పరమైన అంశం తెలంగాణ ప్రభుత్వం బాధ్యతని, వారికి ప్రైవేట్ హాస్పటల్ లో ఎవరైనా చికిత్స నిరాకరిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. సిద్దిపేట పోలీసులు గజ్వేల్ లో జరిగిన ప్రమాదంలో మరణించిన దానిపై కూడా ఇప్పటికే కేసు నమోదైందని, వారికి రావాల్సినవి అన్ని బెనిఫిట్స్ ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News