Monday, December 23, 2024

ఒక్క కార్డుతోనే ఆరోగ్య సమస్యలన్నీ తెలుస్తాయి: సత్యవతి

- Advertisement -
- Advertisement -

ములుగు: ములుగులో హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వైద్యానికి పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లా కలెక్టరెట్ లో  వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు.  ఒక్క కార్డుతో ఆరోగ్య సమస్యలు తక్షణం తెలుసుకుంటామన్నారు. ఈ కార్డులు అందించడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అడగకముందే అన్ని ఇస్తున్నారని, భవిష్యత్ లో ములుగు జిల్లాకు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎంపి మలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, టిఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిహెచ్ శ్రీనివాస్ రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News