Wednesday, January 22, 2025

తెలంగాణ ఆరోగ్య వీణ!

- Advertisement -
- Advertisement -

 

ప్రజలందరికీ వైద్య, విద్య అందుబాటులో ఉన్నప్పుడే ప్రతి పల్లె మూల అభివృద్ధి సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. గ్రామీణ, బస్తీ స్థాయి నుండి తెలంగాణ వైద్య, విద్య రంగంలో విప్లవాత్మకమైన దిశలో దూసుకపోతున్నది. సిఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యలు వల్ల ప్రజల జీవితాలు బాగు పడుతున్నాయి. దేశ చరిత్రలో మంగళవారం ఒకేసారి 8 మెడికల్ కళాశాలను ప్రారంభించారు. కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డి, రామగుండం, వనపర్తి, జగిత్యాల, మంచిర్యాలలోని మెడికల్ కాలేజీల్లో తరగతుల ప్రారంభం సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇదొక నూతన అధ్యాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం 33 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు.ఈ 33 జిల్లాలో మెడికల్ కళాశాలు, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు.

కళాశాలల పక్కాభవనలతో పాటు అన్ని స్థాయిల్లో సిబ్బంది నియామకం, అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విద్యార్థులకు మెడికల్, పార మెడికల్, పిజి వంటి విద్య రంగంలో సీట్ల పెంపు కూడా చేస్తున్నారు.మొత్తం 17కు పెరిగిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. 850 నుండి 2790 ఎంబిబిఎస్ సీట్ల పెంపు. గాంధీ, ఉస్మానియా ఉండేవి. హైదరాబాద్ చుట్టూ మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వరంగలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు ఏర్పాటు అవుతున్నాయి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ 33 జిల్లాల్లో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణగా అవతరిస్తున్నది. ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తృత పరిచి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే కృషి చేస్తున్నది.

టిమ్స్‌లా గచ్చిబౌలి, ఎల్‌బినగర్, అల్వాల్, ఎర్రగడ్డలలో ఏర్పాటు దిశగా ముందుకు పోతున్నది. ప్రతి హాస్పిటల్లో వెయ్యి పడకల చొప్పున నాలుగు వేల పడకలతో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు పోకుండా చర్యలు తీసుకుంటున్నది.

రూ. 2,679 కోట్లతో హైదరాబాద్ నలు దిక్కులా సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు నిర్మాణానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే నిమ్స్ హాస్పిటల్‌లో మరో రెండు వేల పడకలు. 3489 పడకలు అందుబాటులోకి వస్తాయి. అటు వరంగల్ హెల్త్ సిటీని నిర్మిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణ విశ్వవిద్యాలయం. వరంగల్ నగరంలో అధునాతనమైన వసతులతో కొత్తగా రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 24 అంతస్థులతో నిర్మించబోయే ఈ ఆసుపత్రి కోసం రూ. 11 00 కోట్లతో నిర్మించనున్నది.

గుండె, కిడ్నీ, కాలేయం తదితర అవయవ మార్పిడి ఆపరేషన్లతో పాటు కేన్సర్ వ్యాధికి సంబంధించిన కిమోథెరపీ, రేడియేషన్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఆరుదశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఆసుపత్రులు మాత్రమే వుండేవి. రాష్ట్రం వచ్చాక సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఎనిమిది యేండ్లలో 12 కొత్త వైద్యకళాశాలలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వైద్యకళాశాలలు 17కు చేరాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం సిఎం కెసిఆర్ వైద్య, విద్యకు పెద్దపీట వేశారు.

రాష్ట్రం వచ్చాక మొదటిసారి ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ఏర్పాటు చేసింది. ఈ కళాశాలల్లో వైద్య విద్య బోధన విజయవంతంగా జరుగుతున్నది. వీటిలో ఆయా కోర్సులు సైతం అందుబాటులోకి వచ్చా. వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారు. అలాగే ఎనిమిది వైద్య కళాశాలలు ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, జనగామ, వికారాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో ఏర్పాటు, మిగత అన్ని జిల్లాలో వైద్య కళాశాలలు 2023 ఏడాదిలో ఏర్పాటు చేయనుంది. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానా అంటే భయం వేసేది. అక్కడ సౌకర్యాలులేక, డాక్టర్‌లు పట్టించుకోక సిబ్బంది దురుసు ప్రవర్తనతో ప్రజలు ఇబ్బంది పడేవారు.

అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అనే విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉన్నా అక్కడికి వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తామో లేమో అన్న అనుమానం ఉండేది. ఇక గర్భిణీల బాధలు వర్ణనాతీతం. ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు.ఈ రోజు కెసిఆర్ కిట్ దేశానికే ఆదర్శం. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 నుండి 56 శాతం మేరకు ప్రసవాలు పెరిగాయి. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 13.30 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఇంత వరకు రూ. 1176 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. అమ్మ ఒడి (102) వాహనాలను 41 లక్షల మంది వినియోగించుకున్నారు. కెసిఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రసవాల కోసం మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులకే వచ్చేలా నాణ్యమైన వైద్యం అందిస్తున్నది.

కెసిఆర్ కిట్టు ప్రారంభం తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు భారీగా పెరిగాయి. 2017 జూన్ 2 న కెసిఆర్ కెసిఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అమ్మాయి పుడితే రూ. 13 వేలు, అబ్బాయి పుడితే రూ. 12 వేలు ప్రభుత్వం నాలుగు దఫాలుగా బాలింతలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం ద్వారా 15 రకాల వస్తువులను అందిస్తున్నారు. నాటి పరిస్థితులు చూస్తే ఆసుపత్రికి వెళితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వుండేవి. కాన్పు కోసం ఆసుపత్రికి వెళితే కనీస సౌకర్యాలు వుండేవి కావు. ఎంతో మంది బాలింతలు, పుట్టిన పసిగుడ్డులు మరణించిన సంఘటనలు కోకొల్లలు. దీనితో బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిల ముందు ధర్నాలు, ఆందోళనలు నిత్యం జరిగేవి. ప్రైవేటు ఆసుపత్రికి వెళితే వేలు, లక్షల్లో గుంజుకొనేవారు. ఆఖరికి నిండు ప్రాణం కూడా నిలువలేని పరిస్థితి ఉండే.

పిహెచ్‌సి నుండి మండల, జిల్లా ఆసుపత్రులతో పాటు రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఆసుపత్రిలో అన్ని పరికరాలు, మందులు, పరీక్షలు చేసే ల్యాబొరేటీలు ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యే వరకు గర్భిణులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నరు. కెసిఆర్ కిట్ వల్ల బాలింతల, పసిబిడ్డల మరణాలు తగ్గాయి. కరోనా మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వ వైద్య విధానం దేశానికీ ఆదర్శంగా నిలిచింది. కరోనా వేవ్‌లో కూడా ప్రజలకు, గర్భిణులకు, పుట్టిన పసిబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అత్యంత జాగ్రత్తగా వైద్య సేవలు అందించారు. పేద ప్రజల ఆరోగ్యంపట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నది. ప్రభుత్వం బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య శాఖకు నిధులు పెంచింది. అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అవసరమైన అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుతున్నారు.

రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో మహిళలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం జరుగుతున్నది. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ వైద్యానికి జనాదరణ పెరుగుతుంది. సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు అత్యవసర సేవలందిస్తున్నారు. మెరుగైన సేవలను నవజాత శిశువులకు అందిస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టిన నుండి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగయ్యాయి. సిఎం కెసిఆర్ ఆదేశాలతో మంత్రి నిత్యం వైద్య ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ప్రజల కోసం, మహిళల సంక్షేమంపట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్నది. ఆరోగ్య సూచీలో తెలంగాణ 2021లో దేశంలో 3వ స్థానంలో నిలిచింది. సిఎం తీసుకుంటున్న చర్యలు వల్లనే ఇది సాధ్యమైంది.

ప్రస్తుతం బస్తీ దవాఖానాల్లో వైద్య సేవలతో పాటు 57 రకాల పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. బస్తీ దవాఖానాలు ఏర్పాటుతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గింది. దీంతో పేదలకు ప్రభుత్వ వైద్యం నిరంతరం అందుబాటులో ఉంది. హెచ్‌ఎండిఎ పరిధిలో 91 బస్తీ దవాఖానాల ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 60 దవాఖానాలను కొత్తగా ప్రారంభిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 17,130 పడకలు ఉంటే నేడు తెలంగాణలో 28 వేలకు చేరింది.. ఆక్సిజన్ పడకలతో పాటు దాదాపు 11 వేల ఐసియు పడకలు ఉన్నాయి. నాణ్యమైన వైద్య సేవల లక్ష్యంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. వైద్య పరీక్షల పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు, 57 రకాల పరీక్షలు, కిడ్నీ రోగులకు కోసం 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలు, 313 డయాలసిస్ మిషన్లను ఏర్పాటు చేసింది.

రోగుల ఇబ్బంది దృష్ట్యా ఆర్‌టిసి ద్వారా ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తుంది.క్యాథ్ ల్యాబ్‌ల్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు. రోగులకు చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నారు. టిబి, కేన్సర్ పేషెంట్లకు మంచి ఆహారం అందించడం జరుగుతున్నది. ఆరోగ్యశ్రీ కోసం ప్రతి ఏడాది రూ. 850 కోట్లు ఖర్చు చేస్తున్నది. 300 అమ్మ ఒడి వాహనాల ద్వారా మారుమూల పల్లెల నుంచి గర్భిణులను దవాఖానాలకు తరలించే ఏర్పాటు, హై రిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడంలోనూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంలో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. బాలింత మరణాలు తగ్గుదల రేటులోనూ తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.

రాష్ట్రంలో నిర్వహించిన జ్వర సర్వే సక్సెస్ ఫలితాలను ఇస్తుంది. కరోనా కట్టడి చేయడంలో తెలంగాణ దేశంలో ముందు నిలిచింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1.54 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు చేసి, సమస్యలున్న 41 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు, మందులను ప్రభుత్వం అందించింది. 108 వాహనాలను 424 ఏర్పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన గర్భిణులకు సేవలందించేందుకు కృషి చేస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తెలంగాణలో శిశు మరణాల సంఖ్య, మాతృ మరణాల సంఖ్య, 5 ఏండ్ల లోపు చిన్నారుల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దేశం చరిత్ర లో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News