కొత్తకోట : తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా తీర్చి దిద్దడమే ము ఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయమని జెడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌ డ్, మున్సిపల్ చైర్ పర్సన్‌ను సుకేషినిలు అన్నారు. బుధవా రం కొత్తకోట పట్టణానికి 30 పడకల ఆసుపత్రికి కోటి 43 లక్షలు మంజూరు చేసినందు కు చౌరస్తాలో ముఖ్యమంత్రి కెసిఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో మన బస్తీ మన దవఖానాలను ప్రారంభించడమే కాకుండా హెల్త్ సబ్ సెంటర్‌లను మంజూరు చేసిందని, ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా వైద్య సేవలను విస్తరించిందన్నారు. జిల్లాకు వైద్య కళాశాల కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను మంజూరు చేసిందన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుతో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ జెడ్పిటిసి పి. విశ్వేశ్వర్ , సర్పంచ్ సంఘం మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి అమ్మపల్లి బాలకృష్ణ, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్, పట్టణ పార్టీ అధ్యక్షులు బాబురెడ్డి, గుంత మల్లేష్, సింగల్ విండో చైర్మన్ వాసుదేవారెడ్డి, కౌన్సిలర్లు రాములు యాదవ్, కొండారెడ్డి, పద్మ అయ్యన్న, రామ్మోహన్ రెడ్డి, ఎరుకలి తిరుపతి, ఖాజా మైనుదిన్, కో ఆప్షన్ సభ్యులు వహీద్, నాయకులు జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ జి, వెంకటేశ్వర్ రెడ్డి, యాదయ్యసాగర్, పద్మ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.