సూర్యాపేట: ప్రతిఒక్కరూ ఆరోగ్యంతో జీవించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షఅని, సంపూర్ణమైన ఆరోగ్య తెలంగాణే బిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని అందులో భాగంగానే కోట్లాది రూపాయలను వైద్యం కోసం వెచ్చించడం జరగుతుతుందని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.
గురువారం హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మఠంపల్లి మండలం బిల్యానాయక్ తండాకు చెందిన బానోత్ రమేష్ కూతురు పవిత్ర కొంతకాలంగా అనారోగ్యంతో బా ధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పవిత్రకు మెరుగైన చికిత్సను అందించడం కోసం రూ. లక్ష విలువగల ఎల్ఓసీని మంజూరీ చేయించి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల వారిని ఆదుకోవడం కోసమే చికిత్సకు ముందు ఎల్ఓసీని అందజేస్తూ చికిత్స అనంతరం సీ.ఎ మ్. ఆర్.ఎఫ్‌లను ప్రభుత్వం మంజూరీ చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కార్పోరేట్ వైద్యశాలలకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలను అభివృద్ది చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో జరిగిన అభివృద్ధ్దిని గురించి వివరించారు.