Monday, December 23, 2024

వ్యాయమంతో ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : ప్రతిరోజు వ్యాయమం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని, 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు కచ్చితంగా అరగంటసేపు నడవాలని స్థానిక ఎమ్మెల్యే జాజాల సురెందర్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టూ కె రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి పోలీస్‌స్టేషన్ వరకు నిర్వహించిన టూ కే రన్ (పరుగు)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులనుద్దేశించి మాట్లాడారు. ప్రతి రోజు వ్యాయమం చేస్తే ముసలితనం వచ్చే వరకు డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం రాదన్నారు. ఆరోగ్యంపై నిర్లక్షం చేయొద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఆర్డీవో శీను నాయక్, డిఎస్పీ శ్రీనివాసులు, జెడ్పిటిసీ సభ్యుడు ఉషాగౌడ్, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కమిషనర్ జగ్జీవన్, సదాశివనగర్ సీఐ రామన్, స్థానిక పోలీస్ సిబ్బంది, పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News