Monday, December 23, 2024

‘ఆయుర్వేద, న్యూట్రిషనల్‌ సైన్స్‌తో సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నేడు చర్చా కార్యక్రమాన్ని ‘ఆయుర్వేద మరియు న్యూట్రిషనల్‌ సైన్స్‌తో సంపూర్ణ ఆరోగ్యం పొందడం’ అనే అంశంపై నిర్వహించింది. సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కిరణ్‌ డెంబ్లా, న్యూట్రిషన్‌ మరియు వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మరియు ఆయుర్వేద నిపుణులు డాక్టర్‌ నితిక కోహ్లీ ఈ చర్చలో పాల్గొనగా, ఆర్‌జె షెజ్జీ ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరించారు. ఈ చర్చలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల మెరుగైన ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని ప్యానలిస్ట్‌లు వెల్లడించారు. డైట్‌, న్యూట్రిషన్‌, విభిన్న రకాల ఆహారాలను సరైన మోతాదులో తీసుకోవడం గురించి తెలుపుతూనే ఆయుర్వేద మరియు న్యూట్రిషనల్‌ సైన్స్‌ సహా భారతీయ ఆరోగ్య పద్ధతులు గురించి వెల్లడించారు.

ఈ చర్చా కార్యక్రమంలో, గత దశాబ్దకాలంలో భారతీయ సంస్కృతిలో వస్తోన్న మార్పులను గురించి ప్యానలిస్ట్‌లు చర్చించారు. భారతీయ వంటగదిలో విదేశీ వంటకాలు రాకను ప్రస్తావించిన వీరు అలా్ట్ర ప్రాసెస్డ్‌, హై కేలరీ భోజనాలు, స్నాక్స్‌కు బదులుగా సంప్రదాయ, రుచికరమైన ఆహారం అయిన బాదములు, మిల్లెట్స్‌, ఉసిరికాయ, రెడ్‌ రైస్‌ వంటివి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఆయుర్వేద మరియు న్యూట్రిషనల్‌ సైన్స్‌ నుంచి తమ ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చో వెల్లడించిన ప్యానలిస్ట్‌లు, ఈ రెండు అధ్యయనాల ఆధారంగా తీసుకోవాల్సిన ఆహారం గురించి వెల్లడించారు. బాదములు తినడం వల్ల కలిగే పలు ప్రయోజనాలను గురించి ఈ చర్చలో వెల్లడించడంతో పాటుగా భారతీయ కుటుంబాల నమ్మకాలు, ఆయుర్వేద సూత్రాలు, సమకాలీన న్యూట్రిషనల్‌ సైన్స్‌ గురించి కూడా వెల్లడించారు.

బాదములను ‘వటడ ’లేదా ‘బాద్మా’ లేదా ‘వత్మా’ అని ఆయుర్వేదలో చెబుతుంటారని, దీనిని ‘మధుర’, లేదా ‘తియ్యటి గింజ’గా చెబుతూనే ‘స్నిగ్ధ ’లక్షణాలు ఉన్నాయని కూడా అంటారు. దోషాలు నివారించడానికి వీటిని సమతులంగా తీసుకుంటారు. ఇవి ‘వత’, ‘పిత్త’ దోషాలను తగ్గించడంలో సహాయపడతాయి మరియు ‘కఫ’ దోషాలను సైతం నివారిస్తాయి. న్యూట్రిషనల్‌ సైన్స్‌ వెల్లడించే దాని ప్రకారం ఆరోగ్యవంతమైన స్నాక్‌ అవకాశంగా బాదములు నిలుస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుపరచడానికి, మధుమేహం, బరువు నియంత్రణలో మరియు చర్మ ఆరోగ్యం మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి.

సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కిరణ్‌ డెంబ్లా మాట్లాడుతూ ‘‘ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా, బాదముల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి నాకు తెలుసు. ప్రోటీన్‌లు అధికంగా కలిగిన బాదములను ఎన్నో సంవత్సరాలుగా నేను నా క్లయింట్స్‌కు సూచిస్తున్నాను. బరువు నియంత్రణకు ఇవి తోడ్పడతాయి. మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం, భారతదేశంలో ఎంతోమంది తల్లుల్లా నేను నా సొంత వ్యవస్ధను అనుసరిస్తున్నాను. ఎన్నో తరాలుగా మా కుటుంబ సభ్యులు ఆయుర్వేద మరియు ఆధునిక న్యూట్రిషనల్‌ సైన్స్‌ నుంచి నేర్చుకున్న అంశాలవి. అయితే మా కిచెన్‌లో మీరు ఎప్పుడు వచ్చినా లభించేవి మాత్రం బాదములు. వీటి ప్రయోజనాలను గురించి వింటూ పెరిగాను నేను. మా కుటుంబ సభ్యులంతా కూడా బాదములను రోజూ తింటుంటారు. ఇటీవలనే డేవిడ్‌ సీ నీమన్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, బాదములను తరచుగా తినడం వల్ల మజిల్‌ రికవరీ జరగడంతో పాటుగా వ్యాయామాలు చేసినప్పుడు అలసట కూడా తగ్గుతుంది. దీనితో పాటుగా ఆయుర్వేద చెప్పేదాని ప్రకారం, బాదములను తరచుగా తినడం వల్ల మెదడుకు సైతం పోషణ లభిస్తుంది. ఇది చిన్నారులకు చక్కటి స్నాక్‌గా కూడా నిలుస్తుంది’’ అని అన్నారు.

ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్‌ నిఖిత కోహ్లీ మాట్లాడుతూ ‘‘ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం, నేటి సమాజంలో కుటుంబాలు ఆయుర్వేద విజ్ఞానాన్ని సమకాలీన న్యూట్రిషనల్‌ సైన్స్‌తో జోడించడం తప్పనిసరి. ప్రతి రోజూ గుప్పెడు బాదములు తినడం వల్ల కొంతకాలానికి ఆరోగ్యం మెరుగవుతుంది. వేలాది సంవత్సరాలుగా, బాదములు వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. వాటివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద వెల్లడించే దాని ప్రకారం, రెగ్యులర్‌గా బాదములు తింటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్ధ కూడా ఉత్తేజమవుతుంది’’ అని అన్నారు.

న్యూట్రిషన్‌ మరియు వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘చక్కటి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలి. దీనికి చేయాల్సింది ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు పాటించడం, బాదములు లాంటి ఆహారం తీసుకోవడం. బాదములతో బరువు నియంత్రించడం సాధ్యం కావడంతో పాటుగా దీర్ఘకాలిక జీవనశైలి సమస్యలు అయిన టైప్‌ 2 మధుమేహం, కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు (సీవీడీ) వంటి వాటికి సైతం ఇవి తోడ్పడతాయి. కుటుంబ సభ్యులు వీటిని నానబెట్టి, ఉదయమే తినవచ్చు. అలాగే కొద్ది మొత్తంలో రోజంతా వీటిని తినవచ్చు. తరచుగా బాదములను తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ కూడా నియంత్రించబడుతుంది’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News