- Advertisement -
ముంబై : అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ) 2023 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు తన అర్ధ-వార్షిక ఫిర్యాదుల నివేదికను ప్రచురించింది. ఈ నివేదిక అడ్వర్టైజింగ్ స్టాండర్డ్‌లో అభివృద్ధి చెందుతున్న ట్రెండ్‌లు, ప్రావీణ్యం గురించి సమాచారం అందిస్తోంది. దీనిలో ఆరోగ్య సంరక్షణ ఉల్లంఘనలు చార్టులలో అగ్రస్థానంలో ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ప్రాసెస్ చేసిన కేసులలో 34% పెరుగుదల ఉంది. హెల్త్‌కేర్ అత్యంత ఉల్లంఘించే రంగంగా ఉద్భవించింది, మొత్తం ప్రాసెస్ చేసిన యాడ్స్‌లో 21 శాతం ఉన్నాయి. తర్వాత శాస్త్రీయ విద్య, వ్యక్తిగత సంరక్షణ 18 శాతం చొప్పున ఉన్నాయి.
- Advertisement -