Sunday, December 22, 2024

పేదలకు మరింత చేరువైన వైద్యం

- Advertisement -
- Advertisement -
  • కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో ఎన్నో మార్పులు తెచ్చి పేదలకు వైద్యం మరింత చేరువ చేసిందని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని శ్రీ గార్డెన్‌లో జరిగిన వైద్య ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. బాలింతగా ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్, ప్రసవం తర్వాత కెసిఆర్ కిట్ అందిస్తూ ప్రతి ఆడబిడ్డకు సహాయపడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరుపున గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంను ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన వైద్య శాఖ సిబ్బందిని మెమంటో ఇచ్చి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రా రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పుట్ల శ్రీనివాస్, అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు రజిత రాజమల్లారెడ్డి, ఎల్లుబాయ్ బాబు, హారిక మురళిగౌడ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News