Saturday, November 23, 2024

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ఆరోగ్య సంరక్షణకు హెల్త్ ప్లిక్స్ తోడ్పాటు

- Advertisement -
- Advertisement -

దేశంలోని అతిపెద్ద EMR ప్లాట్‌ఫారమ్ అయిన హెల్త్‌ప్లిక్స్ టెక్నాలజీస్, డాక్టర్లచే విశ్వసించబడుతోంది, H1 2023 (జనవరి 23 నుండి నేటి వరకు) లో ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్లాట్‌ఫారమ్‌లో డాక్టర్ సంప్రదింపులు పెరిగాయని ఈ రోజు ప్రకటించింది. సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో సుమారుగా 3.5 లక్షల సంప్రదింపులు ఈ వేదిక పై నమోదయ్యాయి, కంపెనీ ఈ ప్రాంతంలో తనకంటూ ఒక కొత్త వృద్ధి మైలురాయిని నెలకొల్పింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ రోజువారీ సంప్రదింపులలో 36% పెరుగుదలను చూసింది, ఇది రాష్ట్రంలో డిజిటల్ హెల్త్‌కేర్ సేవలను మెరుగ్గా స్వీకరించడాన్ని ప్రదర్శిస్తోంది. H1 2023 సమయంలో వివిధ స్పెషాలిటీలలో రోజుకు సగటున 2300+ కంటే ఎక్కువ డాక్టర్ ల సంప్రదింపులతో, హెల్త్‌ప్లిక్స్ యొక్క EMR ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం నెలవారీ సగటు డాక్టర్ సంప్రదింపులు రాష్ట్రంలో 70,000+కి చేరుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ వైద్య ప్రత్యేకతలలో, డయాబెటాలజిస్టులు H1-2023లో నెలకు సగటున 15,000 సంప్రదింపులతో HealthPlix యొక్క EMR ప్లాట్‌ఫారమ్ యొక్క సంప్రదింపుల కోసం అగ్రశ్రేణి వినియోగదారులుగా ఎదిగారు. వారి వినియోగం నెలకు 12,000+కన్సల్టింగ్ ఫిజిషియన్‌లతో సహా 11,000+ సగటు సంప్రదింపులతో ఎండోక్రినాలజిస్ట్‌లును సైతం అధిగమించింది. కన్సల్టింగ్ ఫిజీషియన్స్, డయాబెటాలజీ మరియు కార్డియాలజీ వంటి కీలక స్పెషాలిటీల కోసం మార్చి 2023లో డాక్టర్ సంప్రదింపులు పెరిగాయని కంపెనీ వెల్లడించింది.

హెల్త్‌ప్లిక్స్ టెక్నాలజీస్‌లో డాక్టర్ గ్రోత్ & రిటెన్షన్ హెడ్ శ్రీ తేజస్వి సింగ్ ఈ వృద్ధి గురించి వ్యాఖ్యానిస్తూ, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ హెల్త్‌కేర్ సేవలకు ప్రసిద్ధి చెందింది. భారతదేశం యొక్క అతిపెద్ద EMR ప్లాట్‌ఫారమ్‌గా, మేము డిజిటల్ హెల్త్ రికార్డులలో వృద్ధిని పెంచాము. దేశంలో, జనాభా స్థాయిలో నాణ్యమైన ఆరోగ్య ఫలితాలను అందించడంలో డిజిటల్ సహాయకులుగా డాక్టర్ లు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలోని డాక్టర్ లు హెల్త్‌ప్లిక్స్ వంటి డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్‌లను వేగంగా స్వీకరిస్తున్నారని ఈ పోకడలు చూపిస్తున్నాయి. ఇంకా, మేము రాష్ట్ర డిజిటల్ హెల్త్ కార్యకలాపాలతో జతకట్టడం సంతోషంగా ఉంది…” అని అన్నారు.

హెల్త్‌ప్లిక్స్‌ని ఉపయోగించటం లో తన అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి కి చెందిన ప్రఖ్యాత మధుమేహ నిపుణుడు డాక్టర్ నేలకుదిటి లక్ష్మణ కుమార్ వెల్లడిస్తూ “HealthPlix నా ప్రాక్టీస్ పరంగా విప్లవాత్మక మార్పులు చేసింది, EMR గురించి నా దృక్పథాన్ని మార్చింది మరియు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది. దీని వైవిధ్యమైన మాడ్యూల్స్ మందుల ప్రిస్క్రిప్షన్ వంటి పనులను క్రమబద్ధీకరిస్తాయి. వినియోగం ట్రాకింగ్ చేయటం తో పాటుగా సమయానుకూలమైన రిమైండర్‌లను సైతం అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ పరిమిత కనెక్టివిటీ కలిగిన మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు సేవలను అందించేందుకు మరియు కమ్యూనిటీ ఉత్పాదకతను పెంపొందించడానికి నన్ను అనుమతిస్తుంది” అని అన్నారు.

హెల్త్‌ప్లిక్స్ రాష్ట్రంలోని 16+ స్పెషాలిటీలలో తన డాక్టర్ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. ఇటీవలి సిరీస్ C ఫండింగ్ తర్వాత తాము దృష్టి సారించిన నూతన ఉత్పత్తి అభివృద్ధి, ప్లాట్‌ఫారమ్‌లో సాంకేతిక మెరుగుదల మరియు డాక్టర్ నెట్‌వర్క్ విస్తరణ సాధ్యమైంది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ AI- పవర్డ్ EMR ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశంలోని ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌ను ప్రారంభించింది, దీనిని ప్రతి రోజూ 10k+ వైద్యులు దీనిని విశ్వసిస్తున్నారు. ఇది ప్రస్తుతం భారతీయ జనాభాలో 2.5 శాతం మందికి సేవలు అందిస్తోంది మరియు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) వంటి క్లిష్టమైన మిషన్‌లకు ఇది కీలకంగా ఉపయోగపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News