మనలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌ని అమితంగా ప్రేమిస్తారు. ఇష్టంగా తింటారు. మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫాస్ట్ ఫుడ్స్ ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవని తెలిసీ ఫాస్ట్ ఫుడ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఊరించే మాయోనైస్ సాస్ ఘుమఘుమలు, కరకరలాడే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అందరినీ ఆకర్షిస్తుంటాయి. ప్రతి రోజూ ఫాస్ట్ ఫుడ్స్‌ని తీసుకోవడం లేదా వారానికి మూడు సార్లైనా ఫాస్ట్ ఫుడ్స్‌ను భుజించడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి గురయ్యే అవకాశాలు అధికమని చెప్పవచ్చు. ఫాస్ట్ ఫుడ్స్‌ని తినడం మానకపోతే శరీరం అనేక రకాలైన అనారోగ్యాలకు గురవుతుంది. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రభావాలు, జంక్ ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుంది.
అంతేకాకుండా జంక్ ఫుడ్స్‌లో కేలరీలు మోతాదుకు మించి ఉంటాయి. పోషక విలువలు శూన్యం. ఫాస్ట్ ఫుడ్‌ని రోజూ తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అనేక రెట్లు పెరుగుతుందని, శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి బిపి పెరగడమే దీనికి కారణమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ తిన్నా కూడా లావు పెరిగే సమస్య ఉండదు. ఇది వారి వంశపారంపర్యత, జీవక్రియపై ఆధారపడి ఉంటుం ది. అయితే చాలా మంది వ్యక్తుల శరీరంలో అదనపు కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వు కారణంగా ఊబకాయం పెరుగుతుంది. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. అనారోగ్య సమస్యలతో పాటు అధిక బరువు సమస్యలకు గురిచేస్తాయి.అలాగే, ఫాస్ట్ ఫుడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత అనారోగ్యంతో పాటు స్ట్రోక్స్ వంటి వివిధ రకాల రోగాల బారినపడే అవకాశాలు ఎక్కువ.
కార్బోహైడ్రేట్స్ అనేవి ఫాస్ట్ ఫుడ్స్‌లో అధిక మోతాదులో ఉంటా యి. వీటి వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అసాధారణంగా పెరుగుతాయి. ఫాస్ట్ ఫుడ్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. ఫాస్ట్ ఫుడ్స్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఒబెసిటీ బారినపడే అవకాశాలు ఎక్కువ. ఫాస్ట్ ఫుడ్‌ని తరచూ తీసుకోవడం వల్ల కోలోరెక్టాల్ క్యాన్సర్‌తో పాటు పేగు క్యాన్సర్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఇవి గుండె పని తీరుపై దుష్ప్రభావం చూపిస్తాయి. తద్వారా హృదయ కండరాల వాపు, ఎథెరోస్క్లెరోసిస్ వంటి వ్యాధుల బారినపడే అవకాశాలు కలవు. ఫాస్ట్ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల కలిగే నెగటివ్ ఎఫెకట్స్‌లో ఇవి ముఖ్యమైనది. ఫాస్ట్ ఫుడ్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి.
ఫాస్ట్ ఫుడ్ అంటే ఇంత క్రేజ్ మన దేశంలోనే కాదు, క్రమేణా ప్రపంచం మొత్తం దీనికి బానిసైపోయింది. ఇప్పటికీ మనం మన సాంప్రదాయ రుచిని మరచిపోయి, హానికరమైన పిండి, కొవ్వు, పామాయిల్ అధికంగా ఉండే ఫాస్ట్ ఫుడ్ కోసం పరుగెడుతున్నాము. ఫాస్ట్ ఫుడ్ అంటే లొట్టలేసుకుని తింటుంటారు. టేస్టు మార్చుకుని మూడ్ రావాలంటే ఫాస్ట్ ఫుడ్ తింటే ఇబ్బంది ఉండదు. కానీ యువత దీన్ని తమ దైనందిన జీవితం లో భాగం చేసుకుని ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. యువతలో ఎక్కువ శాతం తమ దైనందిన జీవితంలో బేకరీలలో, హోటళ్లలో, రోడ్డుపైన పెట్టుడు బండ్ల పైన ఉన్న ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటుపడి ఆరోగ్యాన్ని అబాసుపాలు చేసుకుంటున్నారు. దీంతో ఆరోగ్యం క్షీణించడమే కాకుండా తరతరాలుగా చెడిపోతున్నాయన్న ఆందోళన ఆరోగ్య నిపుణులను వెంటాడుతోంది. ఫాస్ట్ ఫుడ్‌లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంలో మొటిమలు, విరేచనాల సమస్యను సృష్టిస్తుంది.
పంటి నొప్పి, తల నొప్పి, శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తాయి. స్త్రీలు ఈ ఫాస్ట్ ఫుడ్ తింటే సంతాన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందట. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ కొవ్వు శాతం పెరిగి, బరువు పెరుగుతారని దాని వల్ల పిల్లలు పుట్టడం కష్టం అని అంటున్నారు వైద్యులు. ఇక ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు కూడా ఏర్పడతాయని అంటున్నారు నిపుణులు. మహిళలు ఇప్పుడు అతిగా ఆహారం తీసుకోవడం వల్లే ఈ సమస్యలు అని, గర్భంకు సంబంధించి సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. అయితే శరీరంలో కొవ్వు అతిగా చేరి రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతుంది. దీని వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తాయని, కాబట్టి ఫాస్ట్ ఫుడ్ తక్కువ తీసుకుంటే మంచిదని ఇంటి ఆహారం, పోషక ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం పూట మనకు ఆకలి వేసిన సమయంలో స్నాక్స్ కావాలని భావించినప్పుడు ఏదో ఒక పండును తినాలి ఇది మంచి పద్ధతి, కానీ పండుతో మన ఆకలి తీరదు.
దీంతో చిప్స్, బిస్కెట్లు, కేకులు, మిర్చి బజ్జీలు, ఉప్పు కలిపిన పదార్థాలు లాంటివి ఏవేవో తింటుంటాం. వీటి బదు లు పండుతో పాటు బాదంపప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా పెరుగుతో చేసిన పదార్థాలు తీసుకుంటే శరీరానికి ప్రొటీన్లు, మంచి కొవ్వులు లభించి అదనపు శక్తిని ఇస్తాయి. ఉదాహరణకు ఒక యాపిల్ పండుతో పాటు కొన్ని వాల్‌నట్స్‌ను తీసుకుంటే ఆకలితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. చిన్నపిల్లలకు, పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు పోషకాలు అధికంగా అసవరం కాబట్టి వారి ఆహారంలో ఎక్కువ కేలరీలు ఉండాలి. అంటే వాళ్లు పాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి సరిపడా కేలరీలు ఉన్న ఆహారమే ఇవ్వాలి. టిబి ఉన్నవారు అత్యధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. మనం చేసే పనిని బట్టి కూడా కేలరీల అవసరం మారుతుంటుంది. ఎక్కువగా పని చేసే వారు ప్రతి రోజు 2,200 కేలరీల ఆహారం తీసుకోవచ్చు.
అంటే శరీరానికి కావలసిన శక్తిని డ్రై ఫ్రూట్స్ పిస్తా, బాదాం, కాజు, అక్రూట్, ఖర్జూర, కిస్మిస్ లాంటివి తింటే వస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది. శరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి.మామిడి, బొప్పాయి, అరటి వంటి లేత పసుపు రంగు గల పండ్లలో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. బత్తాయి, నారింజ వంటి పండ్లను తీసుకుంటే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదని పలువురు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జామకాయలు అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. రోజుకు ఒక జామకాయ తింటే చాలు ఎటువంటి వ్యాధులు దరికి రావు అని అంటారు. ఇంట్లో చేసే ఆహార పదార్థాలు, ఇంట్లో చేసే భోజనం ఆరోగ్యానికి అన్ని విధాల శ్రేయస్కరం.
మోటె చిరంజీవి
9949194327