Saturday, November 23, 2024

ఛాలెంజ్‌ ఫర్‌ హెల్తీ హార్ట్‌

- Advertisement -
- Advertisement -

Healthy Heart Challenge for awareness of cardiac wellness

హైదరాబాద్‌: ప్రతి ఒక్కరికీ కార్డియోవాస్క్యులర్‌ ఆరోగ్యం అనే ప్రపంచ హృదయ దినోత్సవం 2022 నేపథ్యానికి అనుగుణంగా ఆరోగ్య వంతమైన గుండె కోసం హార్ట్‌ 2 హార్ట్‌ సవాల్‌ను ఇండియా స్వీకరించింది. ఇది వినూత్నమైన శారీరక వ్యాయామ ప్రచారం. దీని ద్వారా ఒకరు ఆరోగ్యవంతమైన అలవాట్లు ఆచరిస్తున్నారా లేదా తెలుసుకునే క్రమంలో నాలుగు ఫ్లోర్లు (60 మెట్లు)ఎక్కవలసినదిగా సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఓ సుప్రసిద్ధ కార్డియాలజీ జర్నల్‌ వెల్లడించే దాని ప్రకారం గుండె ఆరోగ్యం పరీక్షించేందుకు అతి సులభమైన పరీక్షా పద్ధతిగా ఇది నిలుస్తుంది. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం 90 సెకన్లలో 60 మెట్లు ఎక్కలేకపోతే గుండె పనితీరు మందగిస్తుందని అర్థం. హార్ట్‌ 2 హార్ట్‌ ఛాలెంజ్‌ ఫర్‌ హెల్తీ హార్ట్‌ సవాల్‌ స్వీకరించడానికి ఒక్క నిమిషంలో 40 మెట్లను ఎక్కవలసి ఉంటుంది.

కార్డియోవాస్క్యులర్‌ ఫిట్‌నెస్‌ కోసం మెట్లు ఎక్కడం గురించి అపోలో హాస్పిటల్‌, కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘దురదృష్టవశాత్తు 2030 నాటికి ప్రపంచంలో అత్యధికంగా కార్డియోవాస్క్యులర్‌ మరణాలు సంభవించే దేశాలలో ఇండియా అగ్రగామిగా నిలువనుంది. దాదాపు నాల్గవ వంతు మరణాలకు ఇది కారణమవుతుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం, నిశ్చల జీవనశైలి వంటివి ఈ గుండె వ్యాధులకు కారణమవుతున్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, మధుమేహ నియత్రణ వంటి వాటి ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో గుర్తించేందుకు అతి సులభమైన పద్ధతిలలో మెట్లు ఎక్కడం ఒకటి. హార్ట్‌ 2 హార్ట్‌ ప్రచారం ద్వారా భవిష్యత్‌లో కార్డియాక్‌ వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. రెండు నిమిషాలలో మీ గుండె పనితీరును ఖర్చు లేకుండా ఈ మెట్ల పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు’’ అని అన్నారు. హార్ట్‌ 2 హార్ట్‌ హెల్తీ హార్ట్‌ ఛాలెంజ్‌ను జెబీ ఫార్మా ప్రారంభించింది. దీనిద్వారా మెట్లెక్కడం మరిచిపోయిన వారు దానిని గుర్తించగలరు, అలాగే ఆరోగ్య పరీక్షల కోసం వెచ్చించే మొత్తాలూ గణనీయంగా తగ్గుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News