ఎన్‌ఐఆర్‌డితో ఎంఒయు కుదుర్చుకున్న ఐఐఎంఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రజలకు ఆరోగ్యవంతమైన పోషకాహారం అందిచాలన్నది లక్షంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థతో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. మంగళవారం నాడు రాజేంద్రనగర్ ఎన్‌ఆర్‌డిలో ఈ మేరకు రెండు సంస్థలు అవగాహన ఒప్పదం కుదుర్చుకున్నాయి. ఎన్‌ఐఆర్‌డి డైరెక్టర్ జనరల్ డా.నరేంద్ర కుమార్ ఐఐఎంఆర్ డైరెక్టర్ డా.విలాస్ ఎంఓయుపై సంతకాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపధ్యంలో చిరుధాన్యాల ప్రోత్సాహాం కోసం ఈ రెండు సంస్థల మద్య కురుదిన ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది.
గ్రామీణాభివృద్ధిలో భాగంగా చిరుధాన్యాల ఆధారిత జీవనోపాధిని ప్రోత్సహించేందుకు రెండు సంస్థలు కలిసికట్టుగా కృషి చేయనున్నాయి. చిరుధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని ప్రజల ఆహారపు అలవాట్లలో భాగం చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకుబేషన్లు, ఔత్సాహికులను అభివృద్ధి పరచటం మిల్లెట్ మార్కెటింగ్ వ్యూహాలను అభివృద్ది పరచటంలో భాగంగా గ్రామ పంచాయతీల స్థాయిలోనే ప్రణాళికలు రూపోందించటం ద్వారా ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నారు.వ్యవసాయం పోషకాహారం అనుసంధానాలను ప్రోత్సాహించడం ద్వారా ఇతర కార్యక్రమాలతో విలువ ఆధారిత గోలుసును అభివృద్ధి పరచనున్నారు.ఈ సందర్బంగా ఎన్‌ఐఆర్‌డి డైరెక్టర జనరల్ జి.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపధ్యంలో రెండు సంస్థల మధ్య సహకారం చాలముఖ్యమైనదన్నారు.
చిరుధాన్యాల రకాలు, వాటి తయారీపై అవసరమైన పరిజ్ణానంలో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్‌కి ఎంతో సాంకేతిక నైపుణ్యం ఉందన్నారు. వాటి నుండి విలువలు జోడించిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా జాతీయ జవనోపాధుల పరిశోధక మిషన్ క్షేత్రస్థాయిలో స్వయం సేవక మహిళా సంఘాల ద్వారా వ్యాపార అవకాశాలను , మార్కెటింగ్ మద్దతును సృష్టించడంలో ఎన్‌ఐఆర్‌డి సమన్వయంతో పనిచేస్తుందన్నారు.సూక్ష్మ సంస్థల ద్వారా మినుములను ప్రోత్సహించడం వారి జీవనోపాధికి తోడ్పడుతుందన్నారు. తద్వారా దేశ ప్రజల ఆరోగ్యకరమైన పోషణకు దోహదపడుతుదని డి.జి డా.జి నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోఫెసర్ జి.వి, డా.విలాస్ టోనాపి, రాజు , రాధికారాణి, డా.సుర్జిత్ విక్రమ్ డా.నిత్య .డా.వెంకటేష్ భట్ డా.స్టాన్లీ తదితరులు పాల్గొన్నారు.