Wednesday, January 22, 2025

ప్రజలంతా ఆరోగ్యంగా బతికితేనే ఆరోగ్య తెలంగాణ

- Advertisement -
- Advertisement -
  • రుతు చక్రం లేకుంటే జీవన చక్రం లేదు
  • సిద్దిపేట అక్కా చెల్లెలు ఆరోగ్యంగా ఉండాలని రుతుప్రేమ కార్యక్రమాన్ని చేపట్టాం
  • తడి, పొడి హానికరమైన చెత్త వేరు చేసి ఇచ్చిన ఘనత మీదే..
  • ప్రతి ఇల్లు శుభ్రంగా నిలిపినట్లే గల్లీ, పట్టణాన్ని శుభ్రంగా నిలపాలి
  • రాష్ట్ర ఆర్థిక, వైదారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: ప్రజలంతా ఆరోగ్యంగా బతికితేనే ఆరోగ్య తెలంగాణ అవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైదారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 30,31 వార్డుల్లో రుతుప్రేమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున అభివృద్ధి నిర్మాణాలు, సంక్షేమం ఎప్పుడు ఉండేదే కానీ ప్రత్యేకంగా మహిళలు ఆరోగ్యంగా, సంతోషంగా, రోగాల భారిన పడకుండా చేసే ప్రయత్నమే రుతుప్రేమ అన్నారు. రుతు చక్రం లేకుంటే జీవన చక్రం లేదన్నారు. మనిషి మనుగడకు మూల కారణం రుతుచక్రం, అభివృద్ధి చెందిన ఆమెరికా, యూరప్ దేశాల్లో ఈ మెన్స్రువల్ కప్పులు వాడుతున్నారన్నారు. మన సిద్దిపేట అక్కా చెల్లెలు ఆరోగ్యంగా ఉండాలని ఈ రుతు ప్రేమ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చెత్త రహిత కుండీలు లేని సిద్దిపేటగా మార్చుకున్నామని తెలిపారు.

గొప్పతనం సిద్దిపేట ప్రజలతోనే సాధ్యమైందని తడి, పొడి హానికరమైన చెత్త వేరు వేరు చేసి ఇచ్చిన ఘనత మీదేనన్నారు. ఇప్పటికే నియోజక వర్గ పరిధిలోని చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్ మండలాల మహిళలు రుతుప్రేమ కప్పులు వాడుతున్నారని వారి తరహాలోనే మన పట్టణ మహిళలు సైతం ముందుకొచ్చి ఈ రుతుప్రేమ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదివారం అయినప్పటికి సిపి శ్వేత, అదనపు కలెక్టర్ గరియా ఆగర్వాల్ ఈ కార్యక్రమానికి వచ్చి మాతోటి అక్కా చెల్లెలు ఆరోగ్యంగా ఉండాలని ముందుకొచ్చి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. సిద్దిపేట ప్రజారోగ్యం కోసం పని చేస్తున్నామని ఇవాళ ఉదయం 6 గంటలకే డిగ్రీ కళాశాల నుంచి పాత బస్టాండ్ వరకు నడుస్తూ చెత్త తొలగిద్దాం కార్యక్రమంలో హాజరై రోడ్డుపై ఉన్న చెత్తను ఏరివేసి అందరిలో స్పూర్తిని నింపారని సిపి శ్వేతను అభినందించారు.

అలాగే తోటి మహిళ ఆరోగ్యాన్ని కాపాడేలా తమ వంతు సామాజిక తోడ్పాటు అందిస్తున్నారని బెంగుళూరు నుంచి ఇక్కడికి మీ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న డాక్టర్ శాంతి సేవలు అభినందనీయమని కొనియాడారు. అంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్ గరియా ఆగర్వాల్ మాట్లాడుతూ మా కుటుంబంలో అమ్మతో తప్పితే పాదర్, బ్రదర్స్‌తో ఈ విషయాన్ని ఎప్పుడు మాట్లాడలేదని కానీ ఇవాళ ఇలాంటి బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఈ రుతుప్రేమపై చర్చించడమే మన మహిళల మొదటి విజయంగా బావించాలన్నారు. తడి, పోడి, వేరువేరుగా చేస్తున్న క్రమంలో ఈ హానికరమైన చెత్తలో భాగమైన శానిటరి ప్యాడ్స్ వల్ల ఎంత నష్టమో వివరించారు. రుతుప్రేమ మెన్స్రువల్ కప్పుల ద్వారా డబ్బులు ఆదా, ఆరోగ్య రక్షణ, సిద్దిపేట స్వచ్చత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి బిబి పాటిల్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, కౌన్సిలర్ బందారం శ్రీలత, ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News