Monday, December 23, 2024

ఖుష్బూ సుందర్ ను ప్రశంసించిన శశి థరూర్

- Advertisement -
- Advertisement -

 

Shashi Tharoor

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ తన మాజీ కొలీగ్, బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్‌ను పొగిడారు. ఖుష్బూ ఇటీవల బిల్‌కిస్ బానో కేసు నిందితులను ముందస్తుగా విడిచిపెట్టడాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. దానికి శశి థరూర్ ప్రతిస్పందించారు. బిల్‌కిస్ బానో సామూహిక బలాత్కార కేసులో నిందితులైన మొత్తం 11 మందిని ముందస్తుగా విడుదల చేశారు. వారంతా జీవిత ఖైదు శిక్షను ఎదుర్కొంటున్న వారే. ఈ నెల గుజరాత్ ప్రభుత్వం వారి ముందస్తు విడుదలకు అనుమతిని ఇచ్చింది. ‘ఇలాంటివి మానవాళికి, మహిళలకు ఓ అవమానం’ అంటూ ఖుష్బూ విమర్శించింది. బిజెపి నాయకురాలైన ఖుష్బూ వైఖరిని శశి థరూర్ మెచ్చుకున్నారు. ‘రైట్ వింగ్(బిజెపి) కన్నా, మంచి విషయానికి నిలబడ్డారు’ అంటూ ఆమెను ప్రశంసించారు. ఆయన తన ట్వీట్‌లో ‘వినండి, వినండి ఖుష్బూ సుందర్ ఏమి చెబుతున్నారో! మీరు రైట్ వింగ్(బిజెపి) వైపు నిలబడ్డం కన్నా, మంచి వైపు నిలబడ్డం గర్వంగా ఉంది’ అని రాశారు. ఆయన ఖుష్బూ ట్వీట్‌ను కూడా జోడిస్తూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News