Sunday, December 22, 2024

కృష్ణా ట్రిబ్యునల్‌లో ఎపికి చుక్కెదురు!

- Advertisement -
- Advertisement -

ఈనెల 29లోపు ఎస్‌ఒసి ఫైల్ చెయ్యండి
ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్యన కృష్ణానదీజలాలను తిరిగి పంపకాలు చేసేందకు సంబంధించి ఈ నె ల 29లోపు ఎస్‌ఒసి(స్టేట్ ఆఫ్ కేస్) ఫైల్ చేయాలని జస్టిస్ బ్రి జేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం నాడు కృష్ణా జలాల వివాదాలపై కృ ష్ణా ట్రిబ్యునల్‌లో విచారణ జరిగింది.ఎస్‌ఒసి ఫైల్ చేయటం లో మరికొంత సమయం కావాలని ఏపి కోరింది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉన్నందున స్టేట్‌మెంట్ సమర్పించడానికి సమయం కావాలని కోరింది.

ఏపీ వాదనలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెండింగ్ కేసుల కు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఎస్‌ఒసి ఫైల్ చేయటంలో కావాలనే ఏపీప్రభుత్వం కాల యాపన చేస్తుందని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకుపోయింది.స్టేట్‌మెంట్ స మర్పించడానికి జూన్ వరకూ సమయం ఇవ్వాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఈ నెల 29లోపుగా స్టేట్‌మెంట్ సమర్పించాలని ఏపీకి ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. వాదనలు సమర్పించిన తర్వాత రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలకు ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ్ర టిబ్యునల్ వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది.కాగా కృష్ణా నదీజలాల్లో తెలుగు రాష్ట్రాలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రతిపాదించిన1050టిఎంసీల నీటి కేటాయింపుల్లో తమ రాష్ట్రానికే 789టిఎంసీల నీటికి కేటాయించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గత నెలలోనే స్టేట్‌ఆఫ్‌కేస్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎస్‌ఒసి కేటాయించకుండా జాప్యం చేస్తూ వస్తోంది. ఇదే విషయంపైనే సోమవారం ట్రిబ్యునల్ ముందు ఏపి ,తెలంగాణ రాష్రాలకు చెందిన వాదనలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News