Wednesday, November 6, 2024

పోలవరంపై సిఎంల స్థాయిలో తేల్చుకోండి : సుప్రీం

- Advertisement -
- Advertisement -

ఎపి, తెలంగాణ, ఒడిశా,
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు త్రిసభ్య
ధర్మాసనం ఆదేశం
ప్రాజెక్టుపై వాస్తవిక నివేదిక
ఇవ్వాలని కేంద్ర
జలశక్తి శాఖకు ఆదేశం
విచారణ డిసెంబర్
7వ తేదీకి వాయిదా

మన తెలంగాణ / హైదరాబాద్ : పోలవరంపై అవసరమైతే సిఎంలు, సిఎస్‌ల స్థాయిలో చర్చలు జరపాలని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సరిహద్దు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పోలవరంపై వాస్తవాలతో కూడిన నివేదక అందించాలని ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించింది. నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించలేదంటూ తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. తమ రాష్ట్రాల్లో ముంపు సమస్యలు ఉన్నాయని కొందరు వ్యక్తులు, సంస్థలు కలిపి పిటిషన్లు వేశారు. పర్యావరణ శాఖ అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణానికి పొంతన లేదని ఫిర్యాదు చేశారు. పర్యావరణ అనుమతులపై పునః సమీక్ష చేయాలని సుప్రీంను కోరారు. అన్ని పిటిషన్లు కలిపి త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసు విచారణలో అదనపు పత్రాలు సమర్పించేందుకు రాష్ట్రాలు అనుమతి కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించింది. కేసు విచారణ డిసెంబర్ 7కి వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News