Monday, January 20, 2025

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. బుధవారం విచారణ చేపట్టేందుకు సిజెఐ అంగీకరించారు. ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడించనున్నారు. చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన మెన్షన్ మెమోపై సిజెఐ నిర్ణయం తీసుకోనుంది. సోమవారం సిజెఐ ముందు చంద్రబాబు తరఫు న్యాయవాదులు మెన్షన్ చేశారు.

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణ ఎసిబి కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి బుధవారానికి వాయిదా వేశారు. మంగళవారం విజయవాడ ఎసిబి కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. ఎసిబి కోర్టు ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూరి పని చేయనున్నారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను విచారణ చేయాలని ఆయన తరుఫు న్యాయవాదులు కోరారు. సిఐడి వేసిన కస్టడీ పిటిషన్‌లో చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్‌పై మంగళవారం వాదనలు వినాలని చంద్రబాబు తరఫు లాయర్లు తెలిపారు. ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి పేర్కొన్నారు. రేపటి నుంచి తాను సెలవుపై వెళ్లనున్నట్లు ఇన్‌ఛార్జి జడ్జి తెలిపారు. రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి కోరారు.

Also Read: అత్త, బామ్మర్థిని చంపి… ఇల్లు తగలబెట్టి… మంటల్లో దూకిన అల్లుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News