Monday, December 23, 2024

ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన కేసు విచారణ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుధ్ భోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణకు రానుంది. 17ఎ సెక్షన్‌తో ముడిపడి ఉండడంతో ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవదంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సెక్షన్ 17పై ధర్మాసనం భిన్న తీర్పులు వెల్లడించిన నేపథ్యంలో ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News