Sunday, December 22, 2024

నేడు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌సి కవిత బెయిల్ పిటిషన్లపై గురువారం రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు విచారించనుంది. మధ్యంతర, సాధారణ బెయిల్ పిటిషన్లను కవిత దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల వల్ల ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇడి కస్టడీ ముగిసియడంతో సాధారణ బెయిల్ ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు. కవిత బెయిల్ పిటిషన్లను ఇడి వ్యతిరేకించింది. కవిత బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఇడి కోర్టుకు వివరించింది. ఈ కేసులో మరికొందరిని ప్రశ్నిస్తున్నట్లు ఇడి కౌంటర్ దాఖలు చేసింది. ఇడి కౌంటర్‌కు రిజాయిండర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కవిత న్యాయవాదులు కోరారు. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 15న కవితను ఇడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పది రోజుల కస్టడీ తరువాత జ్యూడీషియల్ కస్టడీకి సిబిఐ కోర్టు పంపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News