Sunday, December 22, 2024

కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనున్నది. న్యాయమూర్తి స్వర్ణకాంత్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టనున్నది. కాగా సిబిఐ, ఈడి కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఎంఎల్ సి కవిత ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి సర్వవిధితమే. అయితే బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పైగా ఈడి జ్యుడీషియల్ రిమాండ్ ను ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కవిత మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందన్నది సర్వవిదితమే. ఈ నేపథ్యంలో కోర్టు కవితకు కూడా బెయిల్ మంజూరు చేస్తుందా, లేక తిరస్కరిస్తుందా అన్నది ఉత్కంఠభరితంగా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News