Friday, December 20, 2024

MLC Kavitha: ఎంఎల్‌సి కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కవిత పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కవితలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కవిత తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలను వినిపించారు. నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసేులను పరిశీలించాలని కోరారు. మహిళను ఈడీ కార్యాలయానికి ఎలా పిలుస్తారంటూ కపిల్ సిబాల్ వాదించారు.

అయితే పీఎంఎల్‌ఏ యాక్ట్ కింద ఎవరినైనా కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలవచ్చని ఈడీ తరుపున న్యాయవాది అన్నారు. ఇరువరురి వాదనలు విన్న జస్టిస్ అజయ్ రసోగి, జస్టిస్ ద్వివేదిలతో కూడిన ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇడి అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇడి సమన్లు రద్దు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. అదేవిధంగా మద్యం కుంభ కోణంలో తన నివాసంలో గాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని తనను విచారణ చేయాలని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. తనను ఇడి అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News