Monday, January 20, 2025

సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్ 5కు వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్ 5 కు వాయిదా పడింది. స్పెషల్ జడ్జి నాగ్‌పాల్ ఈ విచారణను వాయిదా వేశారు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఈడీ స్పందన తమకు అందలేదని సిసోడియా తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈడీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నట్టు సిసోడియా తరఫు న్యాయవాది ధ్యాన్ కృష్ణన్ కోర్టుకి తెలిపారు. ఇందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News