Friday, November 22, 2024

గుండెపోటు మరణాల నివారణ చర్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గుజరాత్‌లో దసరా పండగ సందర్భంగా గర్భా నృత్యం చేస్తూ పలువురు మృతి చెందారు. అకస్మాత్తుగా సంభవిస్తున్న ఈ మరణాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా సీపీఆర్ టెక్నిక్‌లో శిక్షణ ఇవ్వడానికి బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 10 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్య కేంద్రాల ద్వారా ఈ శిక్షణ కల్పిస్తారు. 2021 నుంచి 2022 మధ్యకాలంలో ఈ గుండెపోటు మరణాలు దాదాపు 12.5 శాతం పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News